EPAPER
Tuesday, March 31, 2026
Google search engine

ఒక గ్రామం తీసుకున్న నిర్ణయం…ఇప్పుడు మొత్తం జిల్లాకు ఆదర్శంగా మారుతోంది.

📰 Generate e-Paper Clip

ఒక గ్రామం తీసుకున్న నిర్ణయం…ఇప్పుడు మొత్తం జిల్లాకు ఆదర్శంగా మారుతోంది.

జనం వాయిస్, వెబ్ డెస్క్:

కోరుట్ల నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజారోగ్యంపై పంచాయతీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అనారోగ్యానికి కారణమవుతున్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్లాస్టిక్ వినియోగం, గంజాయి విక్రయం, బహిరంగ మద్యపానం, ధూమపానం వంటి వాటిపై నిషేధాలు విధిస్తున్నారు.
సంగెం గ్రామంలో క్యాన్సర్ కేసులు పెరగడంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆలయాలు, శుభకార్యాల్లో ప్లాస్టిక్ బదులు స్టీల్, ఆకుల పళ్లెలను వినియోగించేలా నిర్ణయించారు.
కథలాపూర్ మండలంలో గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి అమ్మితే రూ.20 వేల జరిమానా విధించడమే కాకుండా, సమాచారం ఇచ్చిన వారికి రూ.5 వేల బహుమతి ప్రకటించారు.
అయిలాపూర్ గ్రామంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ధూమపానం, మల విసర్జనపై పూర్తిగా నిషేధం విధించారు. ప్రజలు తిరిగే ప్రదేశాల్లో ప్లాస్టిక్, గాజు సీసాలు పడేయొద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
ఇక కొన్ని గ్రామాల్లో ఐస్క్రీమ్ బండ్లకే నో ఎంట్రీ చెప్పారు. కల్తీ ఆహారం వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

చివరికి ఒక స్పష్టమైన సందేశం —
ఆరోగ్యం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే గ్రామం మారుతుంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!