గన్నవరం ఎయిర్‌పోర్టులో హృదయాన్ని కదిలించిన ఘటన.
మహిళ కన్నీళ్లు గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
తక్షణమే ఫిర్యాదు స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు.
ప్రజా సమస్యలపై స్పందనకు మరో ఉదాహరణ.
భూమి కబ్జాపై న్యాయం చేయాలని హామీ.
జనం వాయిస్, అమరావతి:
గన్నవరం ఎయిర్‌పోర్టులో మనసును హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ కష్టాన్ని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చలించిపోయారు. ఆమె సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సతీమణితో కలిసి గన్నవరం ఎయిర్‌పోర్టు కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌ను చూడటానికి కొంతమంది మహిళలు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. భద్రతా కారణాలతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ దృశ్యాన్ని గమనించిన పవన్ కల్యాణ్ తన సతీమణితో కలిసి మహిళల వద్దకు నడిచి వెళ్లారు. వారితో మాట్లాడి, సెల్ఫీలు దిగారు. ఈ సమయంలో కాకినాడకు చెందిన ప్రేమ కుమారి అనే మహిళ పవన్ కల్యాణ్ వద్ద కన్నీరు పెట్టుకుంది. తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరింది. మహిళ వేదనను విన్న పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారు. ఆమె ఫిర్యాదును తక్షణమే స్వీకరించాలని, సమస్యపై సమగ్రంగా విచారణ చేసి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల కష్టాలపై నేరుగా స్పందిస్తూ, తక్షణ చర్యలకు ఆదేశాలు ఇవ్వడం మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజా బాధ్యతను చాటిందని అక్కడున్నవారు అభిప్రాయపడ్డారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments