EPAPER
Monday, February 16, 2026
Google search engine

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకులు మృతి!

📰 Generate e-Paper Clip

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకులు మృతి!

జనం వాయిస్,ఖమ్మం, డిసెంబర్03:


ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది, అతి వేగం ముగ్గురు ప్రాణా లను బలి తీసుకుంది. సత్తుపల్లిలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తు పల్లి మండలం కిష్టారంలో వేగంగా దూసుకువచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.కారు వేంగంగా వెళ్తూ.. అదుపుతప్పి హైవేపై డివైడర్ ను ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు చంద్రుగొండ నుంచి సత్తుపల్లిలోని జరుగుతున్న శుభకార్యానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.మృతులు సత్తుపల్లి పట్టణం కొమ్మేపల్లి కాలనీకి చెందిన సిద్దేశీ జాయ్ (18), చంద్రుగొండకు చెందిన మర్సకట్ల శశి (12), షాదిక్ (16)గా గుర్తించారు. ఈ ఘటనలో తలారి అజయ్, ఇమ్రాన్ అనే యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.కారులో మొత్తం ఐదుగురు ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే రోడ్డు ప్రమాదానికి దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టా రు. అయితే ఐదుగురు కూడా మైనర్లు కావడంతో.. ఏమైనా మత్తులో డ్రైవింగ్ చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!