EPAPER
Monday, February 16, 2026
Google search engine

నటుడు విజయ్ పార్టీకి ఎన్నికల గుర్తు: విజిల్

📰 Generate e-Paper Clip

నటుడు విజయ్ పార్టీకి ఎన్నికల గుర్తు: విజిల్

జనం వాయిస్, వెబ్ డెస్క్:



తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి, ఈ నేపథ్యంలో నటుడు విజయ్ పార్టీ తమిళిగ వెట్రి కళగం,కు ఎన్నికల సంఘం గురువారం విజిల్ గుర్తును కేటాయించింది.
తమిళనాడు రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సన్నద్దం అవుతున్నాయి. అయితే ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సొంత పార్టీనికి పెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఎన్నికల బరిలో దిగేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నా రు. ఇందులో భాగంగానే తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగంకు కామన్ సింబల్ దక్కించుకోవడంపై ఆయన దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవలే తమ పార్టీకి ఉమ్మడి గుర్తును కేటాయించాలని విజయ్ ఎన్నికల సంఘానికి ధరఖాస్తు చేసుకున్నారు. దీనిపై పరిశీలన జరిపిన ఎన్నికల సంఘం తాజాగా విజయ్ టీవీకే పార్టీకి విజిల్‌ గుర్తును కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.అయితే ఇప్పటికే తాము ఏపార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని విజయ్,స్పష్టం చేశారు.
దీంతో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయ్ ఒంటరి గా బరిలోకి దిగననున్నట్టు తెలుస్తోంది. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో డీఎంకే కూటమి, ఏఐ ఏడీఎంకే-బీజేపీ కూటమి, నామ్ తమిళ్ కట్చి, టీవీకే మధ్య చతుర్ముఖ పోటీ ఏర్పడే అవకాశాలున్నా యని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!