పాన్ లింక్ చేయకపోతే జనవరి నుంచి డీయాక్టివ్
జనం వాయిస్,ముంబై, నవంబర్ 3:
దేశంలోని ప్రతి పన్ను చెల్లింపుదారుడికి పాన్ కార్డు అత్యంత కీలకం. పన్ను రిటర్నులు దాఖలు చేయడం, బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం, పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించడం వంటి అనేక ఆర్థిక కార్యక్రమాలకు పాన్ తప్పనిసరి.అయితే, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం ఇప్పటికీ పూర్తిచేయని వారు ఉన్నారు. ఇలాంటి వారు ఇక ఆలస్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాన్, ఆధార్‌లను లింక్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు సూచించింది. ఈ ప్రక్రియకు గడువును కూడా పలుమార్లు పొడిగించింది.ఇప్పుడు తాజా గడువు 2025 డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంది. ఈ తేదీ వరకు లింక్ చేయకపోతే, 2026 జనవరి 1 నుంచి మీ పాన్ కార్డు డీయాక్టివ్ అవుతుంది. దీంతో పన్ను, బ్యాంకింగ్, పెట్టుబడులకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఆగిపోవచ్చు.నిపుణులు చెబుతున్నట్లు ఒక చిన్న నిర్లక్ష్యం మీ ప్రధాన ఆర్థిక ప్రణాళికలకు ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి సమయానికి పాన్-ఆధార్ లింక్ ప్రక్రియ పూర్తిచేయడం మంచిది.మీ పాన్–ఆధార్ లింక్ స్థితి తెలుసుకోవాలంటే,ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి “లింక్ ఆధార్ స్థితి” ఎంపికపై క్లిక్ చేయండి. పాన్, ఆధార్ నంబర్లను నమోదు చేసిన వెంటనే లింక్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.ముఖ్యమైన ఈ పని కొద్ది నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతుంది. ఇప్పుడే లింక్ చేసి భవిష్యత్ ఇబ్బందులను నివారించండి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments