సంక్రాంతికి ఊరెళ్తున్నారా? అప్రమత్తంగా ఉండండి.
పండుగ వేళ ఇళ్ల భద్రతపై పోలీసుల హెచ్చరిక.
నిర్లక్ష్యం వద్దు – ముందస్తు జాగ్రత్తే రక్షణ.
జనం వాయిస్, హైదరాబాద్, జనవరి 10:
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే వారు ఇంటి భద్రత విషయంలో ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచించారు. పండుగ వేళ తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగలు కాపుకాస్తారని వి.సి. సజ్జనార్ హెచ్చరించారు. ప్రయాణానికి ముందు ఇంటిని సురక్షితంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. నగదు, బంగారు ఆభరణాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని సూచించారు. అలాగే పండుగకు వెళ్లుతున్నామని తెలిపే వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని తెలిపారు. అలాంటి సమాచారం దొంగలకు సంకేతంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇంటి తాళం వేసి వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని, అవసరమైతే పరిసరాలపై నిఘా పెంచేలా సహకరించాలని కోరారు. ఏదైనా అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తే వెంటనే అత్యవసర పోలీసు సేవలను సంప్రదించాలని సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల బాధ్యత అని స్పష్టం చేసిన సజ్జనార్, అందరూ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జాగ్రత్తే నిజమైన భద్రత అని ఆయన సందేశం ఇచ్చారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments