EPAPER
Sunday, February 15, 2026
Google search engine

06-02-2026..శుక్రవారం..రాశి ఫలితాలు.

📰 Generate e-Paper Clip

06-02-2026..శుక్రవారం..రాశి ఫలితాలు.
—————————————
మేషం

ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమునకు ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారమున లాభాలు అందుకుంటారు.
—————————————
వృషభం

దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.
—————————————
మిధునం

ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో శుభకార్యాలు గూర్చి చర్చిస్తారు. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.
—————————————
కర్కాటకం

చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 
—————————————
సింహం

కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఋణాలు కొంత వరకు తొలగుతాయి. నూతన వస్త్ర వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు.
—————————————
కన్య

చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభిస్తాయి.
—————————————
తుల

దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.
—————————————
వృశ్చికం

నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.
—————————————
ధనస్సు

పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఇంటాబయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
—————————————
మకరం

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
—————————————
కుంభం

వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంభందిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగమున అధికారులతో చర్చలు అధిగమిస్తారు.
—————————————
మీనం

స్ధిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు.
—————————————


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!