EPAPER
Monday, February 16, 2026
Google search engine

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరికి ప్రయత్నం.

📰 Generate e-Paper Clip

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరికి ప్రయత్నం.

జనం వాయిస్, రామగిరి:

పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వచర్ల గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నం చేశారు. గ్రామానికి చెందిన కంజర్ల సాగరాచార్యులు జనవరి 28న ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్ళాడు. ఫిబ్రవరి 01 న వేకువజామున 02 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తాళం పగలగొట్టారని ఫోన్ ద్వారా వారి అత్తమ్మ సౌమిత్రి లావణ్య కు తెలుపగా వెళ్ళి చూసింది. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో చూసి సాగర్ కు వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపగా ఎలాంటి వస్తువులు చోరికి గురి కాలేదని తెలిపారు. ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సౌమిత్రి లావణ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తాడవేని శ్రీనివాస్ తెలిపారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!