ఆస్ట్రేలియా ఓపెన్ 2026.. మహిళల విజేతగా రిబకినా..
జనం వాయిస్, స్పోర్ట్స్ న్యూస్:
ఆస్ట్రేలియా ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విభాగంలో కజకిస్తాన్‌కు చెందిన ఎలెనా రిబకినా అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో బెలారస్ స్టార్ అరినా సబలెంకాపై 6-4, 4-6, 6-4 తేడాతో విజయం సాధించి ప్రతిష్టాత్మక కిరీటాన్ని కైవసం చేసుకుంది.
మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించిన రిబకినా తొలి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆధిపత్యం చాటింది. అదే జోరును కొనసాగిస్తూ మొదటి సెట్‌ను 6-4తో సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్లో సబలెంకా గట్టిగా తిరగబడి అదే స్కోర్‌తో సెట్ గెలిచి మ్యాచ్‌ను సమం చేసింది. దీంతో విజేతను నిర్ణయించే మూడో సెట్ మరింత ఉత్కంఠను రేపింది. నిర్ణయాత్మక సెట్లో సబలెంకా 3-0 ఆధిక్యంలోకి వెళ్లి టైటిల్‌కు చేరువైనట్టే కనిపించింది. కానీ రిబకినా అసాధారణమైన పట్టుదల చూపించింది. వరుసగా రెండు సార్లు సబలెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. చివరికి మూడో సెట్‌ను 6-4తో ముగించి కెరీర్లో తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను అందుకుంది. ఇది ఆమెకు రెండో గ్రాండ్‌స్లామ్ కిరీటం కావడం విశేషం. 2023 ఫైనల్లో ఇదే ప్రత్యర్థి చేతిలో ఓటమి చవిచూసిన రిబకినా, ఈసారి ప్రతీకారం తీర్చుకుంటూ ఘన విజయం సాధించింది. మరోవైపు సబలెంకా వరుసగా రెండోసారి ఫైనల్లోనే నిలిచిపోవాల్సి వచ్చింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments