కేంద్రం సంచలన నిర్ణయం.
– ఇక దేశంలో నాలుగు పెద్ద బ్యాంకులు మాత్రమే
జనం వాయిస్,న్యూఢిల్లీ:
దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేయనుంది. ఐదేళ్ల క్రితం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను కలిపి 12గా మార్చిన కేంద్రం… ఇప్పుడు మరోసారి విలీన ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపడేలా బ్యాంకుల సంఖ్యను తగ్గించాలన్నదే కేంద్ర ఆలోచన. 2026–27 ఆర్థిక సంవత్సరంలోపే ఈ కీలక మార్పులు అమల్లోకి రానున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకులను పూర్తిగా పునర్వ్యవస్థీకరించి భవిష్యత్తులో కేవలం నాలుగు పెద్ద బ్యాంకులు మాత్రమే కొనసాగనున్నాయి.వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా–యూనియన్ బ్యాంక్‌ల కలయికతో ఏర్పడే మరో కొత్త పెద్ద బ్యాంక్ ఉండనుంది.మొదట చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించి, దశల వారీగా నాలుగు ప్రధాన బ్యాంకులుగా మార్చే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది.
ఎస్‌బీఐలో ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ విలీనం కానుండగా… ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను ఒకే బ్యాంక్‌గా మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విలీనాలపై ఆర్థికశాఖ ఇప్పటికే అంతర్గతంగా సమాలోచనలు జరుపుతోంది. సంబంధిత ప్రతిపాదనలు కేబినెట్‌కు పంపిన తర్వాత, తుది ఆమోదం కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లనున్నాయి.బ్యాంకింగ్ రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న కేంద్రం… దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన భవిష్యత్తు నిర్మించాలంటే పెద్ద బ్యాంకుల అవసరం ఉందని భావిస్తోంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇలాంటి సంకేతాలే ఇస్తూ చేసిన వ్యాఖ్యలతో… మరోసారి దేశ ప్రభుత్వ బ్యాంకుల్లో భారీ మార్పులు తప్పకుండానే కనిపిస్తున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments