EPAPER
Wednesday, March 4, 2026
Google search engine

42 శాతం రిజర్వేషన్ల అమల్లో జాప్యం.

📰 Generate e-Paper Clip

42 శాతం రిజర్వేషన్ల అమల్లో జాప్యం.
•డా.బీఅర్.అంబేద్కర్ విగ్రహానికి బీసీ నేతలు వినతి పత్రం సమర్పణ.
•బీసీ పోరాటం ఏ వర్గాలకు వ్యతిరేకం కాదు.
•జనాభా దామాషాన బీసీ హక్కులు,ఆత్మగౌరవం,వాటా,కోటా సాధనకై చేస్తున్న పోరాటం.


రాజన్న సిరిసిల్ల,జనం వాయిస్:

 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసిన జీవో 9 తో జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ ,ఎన్నికల నోటిఫికేషన్ చట్ట విరుద్ధమని,రాజ్యాంగ విరుద్ధమని బీసీ వ్యతిరేకులు కోర్టులను ఆశ్రయించగా , హైకోర్టు జీవో 9 చెల్లదని,జీవో 9 తో జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్  ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం,మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా,పాత రిజర్వేషన్లతో ఎన్నికలు జరుపాలని,ఎన్నికలు జరుపుటకు తేదీలను ప్రకటించాలని కోరుతూ కోర్టు ప్రభుత్వాన్ని కోరుతూ,మళ్ళీ విచారణ ఈ నెల 24 కు వాయిదా వేయడం జరిగిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు పొలాస నరేందర్ తో పాటుగా బీసీ జేఏసీ నేతలు కాడార్ల రాములు,ఇల్లందుల వెంకటేష్,పిన్నింటి హన్మాండ్లు తదితరులు తెలియజేశారు.కోర్టుల తీర్పులు ఎలా ఉన్నప్పటికీ, చట్టబద్ధంగా,రాజ్యాంగ బద్దంగా,శాస్త్రీయంగా,పారదర్శకంగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ,స్థానిక ఎన్నికలు జరపాలని,అంతవరకు ఎన్నికలు జరుపక కోర్టులతో న్యాయపోరాటం,కేంద్రంలో రాజకీయ పోరాటం చేయాలని ,పాత రిజర్వేషన్లతో,పార్టీ పర రిజర్వేషన్లతో ఎన్నికలు జరపవద్దని ప్రభుత్వానికి బీసీ జేఏసీ నేతలు పొలాస నరేందర్, కడారి రాములు, ఇల్లందుల వెంకటేష్, పిన్నింటి హన్మాండ్లు తదితరులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి,వారి ప్రసంగాల్లో విజ్ఞప్తి చేశారు.  బీసీలు చేస్తున్న ఈ పోరాటం ఏ వర్గాలకు వ్యతిరేకం కాదని,జనాభా దామాషా ప్రకారం బీసీలకు మంత్రి వర్గంలో,ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులలో,రాజకీయంగా, ఆర్థికంగా సామాజికంగా, విద్యాపరంగా, ఉపాధి, ఉద్యోగ, ప్రమోషన్ల పరంగా రావాల్సిన కోటాకై,బీసీ సంక్షేమముకై రాష్ట్ర బడ్జెట్లో రావాల్సిన వాటాకై,పలు హక్కుల సాధనకై ,ఆత్మగౌరవంకై చేస్తున్న పోరాటమని ,ఈ పోరాటానికి అన్ని వర్గాలవారు,అన్ని మతాలవారు,రాజకీయాలకు అతీతంగా నేతలు, అఖిలపక్ష పార్టీలు,రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు,కోర్టులు మద్దతు తెలపాలని బీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు కడార్ల రాములు, ఇల్లందుల వెంకటేష్ ,పిన్నింటి హన్మాండ్లు,ఉయ్యాల భూమయ్య, చేను హెలపతి,సిహెచ్.రామస్వామి గౌడ్,కనపర్తి సుధాకర్,మల్లారం దేవయ్య, మొగిలోజు సత్యం,కుంభం రవీందర్,కత్రోజు జ్ఞానేశ్వర్,బుర్ర దశ గౌడ్, నాగరాజు ,శ్రీరాముల నర్సయ్య,ముద్రకొల లింబాద్రి,ముద్రకొలా గణేష్,మల్లారం జీ.లక్షి నారాయణ,మోత్కుపల్లి బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!