EPAPER
Monday, February 16, 2026
Google search engine

సింగరేణి కార్మికులు చనిపోతున్న పట్టించుకోరా..!

📰 Generate e-Paper Clip

సింగరేణి కార్మికులు చనిపోతున్న పట్టించుకోరా..!

ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ అగ్రహం.

జనం వాయిస్,రామగిరి, పెద్దపల్లి :


కోల్ కారిడార్ రోడ్డు మరియు పన్నూరు సెంటర్ నుండి ALP వరకు రోడ్డు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,సింగరేణి ఉన్నత అధికారులకు, విజిలెన్స్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని
మాజీ జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు, మాజీ బిజెపి మండల అధ్యక్షుడు మోలుమూరి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇట్టి విషయన్ని వెంటనే పరిష్కరించకపోతే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.ALP మైన్ దేశంలోనే అతిపెద్ద లాంగ్ వాల్ మైన్ ఇక్కడ దాదాపు 3000 ల మంది కార్మికులు పని చేస్తున్నారని వారికి మైన్ కి వెళ్ళడానికి సరైనా రోడ్ లేకపోవడం వల్ల చాల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.సింగరేణి కంపెనీలో విజిలెన్స్ విభాగం ప్రజల కోసం, కార్మికుల కోసం పనిచేయాల్సిన కీలక శాఖ,కానీ రామగుండం RG-III ఏరియాలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి చర్యలను చూస్తుంటే విజిలెన్స్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయినట్టే కనిపిస్తోందన్నారు. అధికారులు ఉన్నా పని చెయ్యాలన్న బాధ్యత లేకుండా, పర్యవేక్షణ లేకుండా, నియంత్రణ లేకుండా అక్రమాలకు సహకరిస్తున్నట్లుగా ప్రజలలో తీవ్ర ఆందోళన నెలకొందని,ఆర్‌జీ–III ఏరియాలో కాంట్రాక్ట్ పనులు, యంత్రాల వినియోగం, బొగ్గు రవాణా, కార్మికుల సమస్యలు ఇలాంటి ప్రతీ విషయంలో అవ్యవస్థ రోజురోజుకూ పెరుగుతోందిని కార్మికులు చెబుతున్న ఫిర్యాదులు వినే అధికారి లేరని అసహనం వ్యక్తం చేశారు. విజిలెన్స్ కు ఫిర్యాదులు పంపినా చర్యలు కనిపించడం లేదని అక్రమాలకు అడ్డా అయిన కొంతమంది అధికారులపై ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.సింగరేణి సంస్థ దేశానికి వేల కోట్ల ఆదాయం ఇచ్చే ప్రముఖ ప్రజా రంగ సంస్థ అని ఇలాంటి సంస్థలో అవినీతి పెరిగితే కార్మికుల భద్రత, పర్యావరణం, ఉత్పత్తి అన్నీ ప్రమాదంలో పడతాయన్నారు. ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని, RG–III లో జరుగుతున్న అన్ని అక్రమాలపై స్వతంత్ర విచారణను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.ప్రజలు, కార్మికులు న్యాయం కోరుతున్నారని విజిలెన్స్ అనే శాఖ పేరుకే ఉండకుండా, నిజంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెంటనరీ కాలనీని పట్టించుకోవడంలో అధికారుల విఫలం అయ్యారని కార్మికులు కష్టపడి కంపెనీని అభివృద్ధిలోకి తెస్తుంటే వారి సంక్షేమాన్ని మర్చిపోతున్న అధికారులు అభివృద్ధి పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఏద్దేవా చేశారు.ఈ సమావేశంలో సెంటినరీ కాలనీ పట్టణ అధ్యక్షుడు తీగల శ్రీధర్, బిజెపి సీనియర్ నాయకులు మేరుగు శ్రీకాంత్ లు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!