EPAPER
Monday, March 23, 2026
Google search engine

ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు.

📰 Generate e-Paper Clip

ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు?


జనం వాయిస్, ములుగు జిల్లా, మార్చి 23:


ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది, కోర్టులో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా పంపారు.కోర్టులకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పలు జిల్లా కోర్టులకు బెదిరింపుల కలకలం రేపగా, సోమవారం ములుగు జిల్లా కోర్టుకు కూడా అలాంటి హెచ్చరిక వచ్చింది. ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆగంతకుల నుంచి ఈమెయిల్ రావడంతో వెంటనే చర్యలు ప్రారంభించారు. పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి, పూర్తిగా తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రతి మూలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో వరుసగా ఇలాంటి బెదిరింపులు రావడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!