స్కూల్‌కి వెళ్లనని బాలుడి డ్రామా.
-మంచం తో పాటు స్కూల్ కి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు.
-సోషల్ మీడియాలో వీడియో వైరల్.
జనం వాయిస్ వెబ్, నవంబర్ 01:
స్కూల్‌కు వెళ్లమని చెప్పగానే మంచాన్ని పట్టుకుని వదలని ఓ బాలుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.కుటుంబ సభ్యులు ఎంతకీ ఒప్పించే ప్రయత్నం చేసినా, అతడు మాత్రం స్కూల్‌కి వెళ్లనని మొండికేశాడు. చివరికి ఆ బాలుడ్ని మంచంతో సహా స్కూల్‌కి తీసుకెళ్లడం జరిగింది.వీడియోలో ఆ బాలుడు మంచంపై పడుకుని గట్టిగా దానిని పట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు.ఎంత లాగినా వదలకపోవడంతో కుటుంబ సభ్యులు నవ్వులు పూయిస్తూ మంచాన్ని లాగుతూ స్కూల్ వైపు నడిపించారు. స్కూల్ గేట్ వద్దకు చేరుకునే సరికి ఇతర విద్యార్థులు అతడిని చూసి నవ్వులు చిందించారు.అంతలోనే ఒక టీచర్ వచ్చి బాలుడిని మంచం పట్టు నుంచి వదిలించేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ అతడు తన మొండిపట్టును విడిచిపెట్టలేదు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా, ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments