EPAPER
Monday, February 16, 2026
Google search engine

వన్డే జట్టు 2025 కెప్టెన్‌గా రోహిత్..

📰 Generate e-Paper Clip

వన్డే జట్టు 2025 కెప్టెన్‌గా రోహిత్..
–  టాప్ ఆర్డర్‌లో కోహ్లీ, రూట్.

జనం వాయిస్, హైదరాబాద్ – జనవరి 01:


వన్డే క్రికెట్‌లో 2025 సంవత్సరానికి అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లతో వన్డే జట్టు 2025ను ప్రకటించారు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ జట్టుకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. నిరుడు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్, ఓపెనర్‌గా కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. టాప్ ఆర్డర్‌లో మరో భారత స్టార్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలవగా, ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ నాలుగో స్థానంలో ఎంపికయ్యాడు. 2025లో వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ఈ జట్టును ఎంపిక చేశారు. ఓపెనర్‌గా రోహిత్‌కు జోడీగా దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్‌కు అవకాశం లభించింది. దక్షిణాఫ్రికాపై శతకాలతో ఆకట్టుకున్న కోహ్లీ మరోసారి తన స్థాయిని చాటడంతో టాప్ ఆర్డర్‌లో స్థానం నిలుపుకున్నాడు. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ ఆల్‌రౌండర్‌గా చోటు సంపాదించగా, మిచెల్ శాంట్నర్ జట్టుకు సమతుల్యత అందిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్‌కు చెందిన మ్యాట్ హెన్రీ, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్, ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, వెస్టిండీస్ బౌలర్ జైడెన్ సీల్స్ ఎంపికయ్యారు. వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మరోసారి తమ అనుభవంతో జట్టులో చోటు సంపాదించుకోవడం విశేషం. 2025లో వన్డే క్రికెట్‌ను ప్రభావితం చేసిన ఆటగాళ్లతో రూపొందిన ఈ జట్టు అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. వన్డే జట్టు 2025లో ఎంపికైన ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్, విరాట్ కోహ్లీ, జో రూట్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మ్యాట్ హెన్రీ, జైడెన్ సీల్స్.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!