విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చైన్ మేన్ ఈ.రఘు సస్పెండ్.
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
జనం వాయిస్, పెద్దపల్లి, ఫిబ్రవరి-04:
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చైన్ మేన్ ఈ. రఘు ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో డిప్యూటీషన్ పై చైన్ మేన్ గా పని చేస్తున్న ఈ. రఘు విధుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అనేకసార్లు మెమోలు జారీ చేసినప్పటికీ ఎటువంటి మార్పు లేకుండా జనవరి 13, 2026 నుంచి ఎటువంటి సమాచారం అందించకుండా విధులకు గైర్హాజరు కావడం గమనించామని మంథని ఆర్.డి.ఓ. నివేదిక సమర్పించారని అన్నారు. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి కమాన్ పూర్ తహసిల్దార్ కార్యాలయం లో చైన్ మేన్ గా పనిచేస్తున్న ఈ. రఘు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా సస్పెండ్ చేస్తున్నట్లు, సస్పెన్షన్ కాలంలో అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ దాటి వెళ్లడానికి వీలు లేదని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments