సింగరేణి టెండర్లలో కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం.
– సైట్ విజిట్ నిబంధన పేరుతో ప్రజాధనం దోపిడీ.
– ఆర్ జి – 3 జీఎం కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా.
జనం వాయిస్, రామగిరి:
సింగరేణి టెండర్లలో ‘సైట్ విజిట్’ నిబంధనను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి పాల్పడిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. ప్రజాధనాన్ని పందికొక్కుల్లా మేస్తూ సింగరేణిని కొల్లగొడుతున్న కాంగ్రెస్ నేతల అవినీతిని ఎండగడుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో రామగిరి మండలం సెంటనరీ కాలనీ ఆర్ జి–3 జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మాట్లాడుతూ, టెండర్ల ప్రక్రియలో నిబంధనల పేరుతో అక్రమాలకు తావిచ్చారని విమర్శించారు. సింగరేణి లాభాలను కొద్ది మంది స్వార్థ ప్రయోజనాల కోసం దోచుకుంటున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ, కార్మికుల హక్కులు, సంస్థ ప్రయోజనాలు పక్కనపెట్టి అవినీతికి తలుపులు తెరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రతిష్ఠను కాపాడేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సింగరేణిలో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వ స్పందన రావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments