EPAPER
Sunday, February 15, 2026
Google search engine

పెద్దపల్లి జిల్లాలో ‘హస్తం’ ప్రభంజనం.

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి జిల్లాలో ‘హస్తం’ ప్రభంజనం.

– రామగుండం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్!

జనం వాయిస్, పెద్దపల్లి జిల్లా:

పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా జరిగిన పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంతో పాటు ప్రధాన మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగిరింది.

*రామగుండం మున్సిపల్ కార్పొరేషన్:*

మొత్తం డివిజన్లు: 60
కాంగ్రెస్: 36 (స్పష్టమైన మెజారిటీతో మేయర్ పీఠం కైవసం)
బిఆర్ఎస్: 13
బిజెపి: 01
స్వతంత్రులు/ఇతరులు: 10
సింగరేణి గడ్డపై కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సింగరేణి కార్మికులు కాంగ్రెస్ వైపే ఉన్నారని ఈ తీర్పు రుజువు చేసింది.

*సుల్తానాబాద్ మున్సిపాలిటీ:*

మొత్తం వార్డులు: 15
కాంగ్రెస్: 12 (భారీ మెజారిటీతో చైర్మన్ పదవి ఖరారు)
బిఆర్ఎస్: 03

*పెద్దపల్లి మున్సిపాలిటీ:*

ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు మెజార్టీ వార్డుల్లో విజయకేతనం ఎగురవేసి, బిఆర్ఎస్ పట్టుకు బ్రేకులు వేశారు.

*మంథని మున్సిపాలిటీ:*

మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని స్వీప్ చేసి తన పట్టును చాటుకుంది.

మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాను స్వీప్ చేసింది.
బిఆర్ఎస్ పార్టీకి కంచుకోటల్లాంటి వార్డుల్లో కూడా ఈసారి ఓటమి ఎదురైంది.
బీజేపీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!