ములుగు జిల్లాలో యువకుడి దారుణ హత్య.
జనం వాయిస్,ములుగు జిల్లా:నవంబర్ 17:
ములుగు జిల్లా మండలం లాలాయగూడెంలోజాడి సమ్మయ్య,అనే యువకుడు దారుణహత్యకు గురయ్యారు. అతనిని కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది…. వివరా ల్లోకి వెళితే.. ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన జాడి సమ్మయ్య (40) మండల కేంద్రంలో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. అతనికి వివాహం కాగా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొద్ది కాలంగా లాలాయగూడెం కు చెందిన మైనర్ బాలిక(16)తో వివాహేతర సంబంధం పెట్టుకుని మద్యానికి బానిస అయ్యారని సమాచారం.గత కొద్ది రోజుల క్రితం సమ్మయ్య తండ్రి సైతం ఇంట్లో గొడవలు అవుతున్నాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సమ్మయ్య ఆదివారం సాయంకాలం టీఎస్ 25 ఏ 7666 నెంబర్ గల హోండా ద్విచక్ర వాహనంపై లాలాయి గూడెం గ్రామానికి రాగా ఆగ్రహంతో ఉన్న మైనర్ బాలిక తల్లిదండ్రులు సమ్మయ్యను గ్రామంలోని ఒక విద్యుత్ స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టగా ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments