విద్య ఒకటే మీ జీవితాలను మారుస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి!
జనం వాయిస్, మహబూబ్ నగర్:
సీఎం రేవంత్ రెడ్డి మహ బూబ్ నగర్ జిల్లా పర్యటన లో భాగంగా రూ”1284 కోట్లతో అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, జడ్చర్ల నియోజకవర్గంలోని చిట్టబోయినపల్లిలో త్రీపుల్ ఐటీ కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, విద్యార్థులతో ముఖాముఖిగా ముచ్చటిం చారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ తన తొలి ప్రాధాన్యత అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. విద్య ఒకటే మన జీవితాలను మారుస్తుందని అన్నారు. మీరు కష్టపడి చదివితే సాధించలేనిది ఏమి లేదని అన్నారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధన మాత్రమేనని వాక్యానించారు.
భాషతో పాటు నాలెడ్జ్ ను కూడా పెంచుకోవాలని, ప్రభుత్వం దగ్గర పంచ డానికి భూములు లేవని తెలియజేశారు. ప్రభుత్వం పేదలకు నాణ్యమైన విద్య అందిస్తుందని, విద్య వల్లే పేదల బతుకులు మారతా యని, అందుకోసమే తాము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
విద్యార్థులకు చిత్తశుద్ధి, పట్టుదల ఉండాలని, విద్య ఒక్కటే జీవితాలను మారు స్తుందని, చదువుకున్న వారికి సమాజంలోగౌరవం ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపి డికె అరుణ ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments