సూక్మా జిల్లాలో తుపాకుల మోత.
జనంవాయిస్, డెస్క్:
మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. చత్తీస్గడ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది, తాజాగా సూక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం…తెలిసిన వివరాలు ప్రకారం…. చింత గుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కరిగుండం అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి, ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికే ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు మరోవైపు సంఘటన స్థలం నుంచి ఆయుధాలు పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments