- ఆబాది జమ్మికుంటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.
- – భయాందోళనలకు గురవుతున్న స్థానిక ప్రజలు.
- జనం వాయిస్, జమ్మికుంట:
- జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో గుప్త నిధుల కోసం తవ్వకాలను చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గత వారం రోజుల నుండి స్థానిక వ్యక్తి సహాయంతో వేరే జిల్లాల నుండి కోయ పూజారులను, ముస్లిం గురువులను, తీసుకొచ్చి వారం రోజుల నుండి తవ్వకాలను స్థానిక మహబూబ్ అలీ పట్టా భూమిలో అక్రమంగా గుప్త నిధుల కోసం శనివారం రోజున అర్ధరాత్రి తవ్వుతుండగా ఏమో శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికంగా ఉండే ప్రజలు వచ్చేసరికి ఆ భూమిలో మంటలు పెట్టినట్టు వ్యక్తులు గమనించి వారి దగ్గరికి వెళ్లి ప్రశ్నించగా స్థానిక మాజీ ప్రజా ప్రతినిధి సహకారంతో తవ్వకాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఇలాంటి ఘటనలో ఈ ప్రాంతంలో ఏనాడు జరగలేదు. గుప్త నిధుల కోసం వచ్చిన పూజాలను చూసి వారు చేసిన పూజలను చూసి స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు వెంటనే ప్రభుత్వ అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న మాజీ ప్రజాప్రతినిధిపై వేరే జిల్లా నుండి ఇక్కడికి వచ్చి తవ్వకాలు చేపట్టిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకొని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొని,ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments