EPAPER
Monday, February 16, 2026
Google search engine

సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.

📰 Generate e-Paper Clip

సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.


జనం వాయిస్, తెలంగాణ:


తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర కేబినెట్‌లో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది.ఇప్పటికే ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, బహిరంగంగా ప్రకటించడంతో కేబినెట్‌లో మార్పులు తప్పవనే అంచనాలు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల్లో మొదలయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది,ఇప్పటివరకు రెండు సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది.ఇంకా విస్తరణరెండు మంత్రి పదవులు రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఖాళీగా ఉన్నాయి.. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు మహమ్మద్ అజారుద్దీన్ ఒకరినే మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. మరో రెండు మంత్రి పదవులు రెండేళ్లు గా ఖాళీగా ఉన్నాయి. దీంతో మంత్రివర్గ విస్తరణ జలపాలని, రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో నిజమాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో. అక్కడి నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడ్డామని, ప్రజల్లో మంచి పట్టుందని వీరు తమ అనుచరుల వద్ద చెబుతున్నారు.ప్రస్తుతం రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడున్న మంత్రుల్లో కొందరిని తప్పిస్తారని తెలుస్తోంది. ఈ మ్యాటర్ ఇప్పుడు మంత్రుల్లో అసలు టెన్షన్‌కు కారణంగా మారింది. పనితీరు, ప్రజా స్పందన, పార్టీ ఇమేజ్ వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రక్షాళన చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎవరి పదవులు పోతాయో, ఎవరు కొనసాగుతారో అన్న టెన్షన్ మంత్రుల్లోనే కాదు, వారి అనుచరుల్లోనూ కనిపిస్తోంది.టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, చేసిన ప్రకటనతో ప్రాంతీయ, సామాజిక సమీకరణాలు, పార్టీ భవి ష్యత్తు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు. మొత్తానికి తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.కొత్తగా ఎవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారి పోయింది. వాస్తవానికి రెండో సారి మంత్రులను తీసుకున్నప్పుడే చాలా మంది పేర్లు వినిపించినా వారికి అవకాశాలు రాలేదు. చాలా మంది సీనియర్లు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మరి వారికి ఏమైనా ఛాన్సులు ఉంటా యా లేదంటే కొత్తవారికి ఎంకరేజ్ చేస్తారా? అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!