EPAPER
Tuesday, March 3, 2026
Google search engine

ఎక్కేక్కి ఏడ్చినా మాజీ మంత్రి ఎర్రబెల్లి.

📰 Generate e-Paper Clip

ఎక్కేక్కి ఏడ్చినా మాజీ మంత్రి ఎర్రబెల్లి.

– పోలీసు స్టేషన్‌కు ఎర్రబెల్లి తరలింపు.

– మద్దతుగా కవిత, రెడ్యా నాయక్ రాక.

– మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి.

జనం వాయిస్, తొర్రూరు,  ఫిబ్రవరి 17:

తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు నర్సింహులపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లో ఉద్రిక్తత నెలకొంది. సంఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన అనుచరులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కూడా ఎర్రబెల్లికి మద్దతుగా పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. పరిస్థితిని తెలుసుకుని అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. పోలీసుల భారీ బందోబస్తు మధ్య పరిణామాలు కొనసాగాయి. మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ కార్యకర్తల పట్ల తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు. ఎన్నాళ్లుగానో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు తాను ఏమి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విధానాలు కాపాడాల్సిన బాధ్యత అందరిదని పేర్కొన్నారు. ఈ ఘటనతో తొర్రూరు రాజకీయాలు మరింత వేడెక్కాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!