ఆర్టీసీ బస్సులో పురుషులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి.
– వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ ,సురభి శ్రీధర్.
జనం వాయిస్, గోదావరిఖని :
మహిళలతోసమానంగా పురుషులకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఆర్టీసీ బస్సులో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారో అదేవిధంగా పురుషులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ ,సురభి శ్రీధర్ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో మహిళలతో పాటు పురుషులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగిందని తెలిపారు. మహిళలకు ఏ ప్రతిపాదన మీద ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారో అదే ప్రతిపాదనపై పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మహిళలు మాత్రమే ఓట్లు వేయలేదని పురుషులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. మహిళలకు ఒకలాగా పురుషులకు మరో లాగా చూడటం ప్రభుత్వానికి సరికాదన్నారు. పురుషులకు సమానత్వం అంటే మహిళకు మాత్రమే ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళలకు ఏ విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారో పురుషులకు అదే విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని సురభి శ్రీధర్ కోరారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments