EPAPER
Saturday, March 14, 2026
Google search engine

గుప్తనిధుల ముఠా అరెస్టు.

📰 Generate e-Paper Clip

గుప్తనిధుల ముఠా అరెస్టు.

– జెసిబి స్వాధీనం..పలువురి అరెస్ట్.

జనం వాయిస్, మహాదేవపూర్:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారంలో శుక్రవారం అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు గుప్తనిధుల కోసం ఓ ఇంట్లో జెసిబి సహాయంతో తవ్వకాలు జరుపుతున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు గుర్తించి జెసిబితో పాటు పలువురిని అరెస్టు చేసి, విచారణ చేపట్టినట్లు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సూరారం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఓ ఇంట్లో జెసిబి సహాయంతో రహస్యంగా గుప్తా నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా పక్కా సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా జెసిబి తో తవ్వకాలు జరుపుతుండడంతో జెసిబి స్వాధీన పరుచుకుని, పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.గుప్తనిధుల పేరుతో తవ్వకాలు జరపడం చట్ట విరుద్ధమని, ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా ఎవరైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వస్తే  వెంటనే  పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!