రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి
జనం వాయిస్,నల్గొండ:
తెలంగాణ : నల్గొండ జిల్లా చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్, దామెర గ్రామానికి చెందిన అనూష (22) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన 14 రోజులకే, బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్రంపోడు సమీపంలో మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనూష వంతెనపై నుంచి వాగులో పడి మృతి చెందగా, నవీన్ తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదాఛాయలు అలుముకున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments