కోడి పందెంలో అదృష్టం.. ఒకే పందెంలో 1.53 కోట్లు గెలుపు..!
జనం వాయిస్,తాడేపల్లిగూడెం:
సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పండుగ రెండో రోజైన గురువారం తాడేపల్లిగూడెం పరిధిలో జరిగిన భారీ పందెం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఒక్క పందెంలోనే రాజమండ్రికి చెందిన రమేశ్ అనే పందెం రాయుడు ఏకంగా 1.53 కోట్లు గెలుచుకున్నాడు. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో గుడివాడకు చెందిన ప్రభాకర్ కోడి, రాజమండ్రి రమేశ్ కోడి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో చివరకు రమేశ్ కోడి విజయం సాధించింది. దీంతో భారీగా పెట్టిన పందెం మొత్తం రమేశ్ ఖాతాలోకి చేరింది. ఈ ఏడాది జిల్లాలో జరిగిన అతిపెద్ద పందెంగా ఇది నిలిచిందని స్థానికులు చెబుతున్నారు.
పందెం రాయుళ్లు కోళ్ల బలాబలాలతో పాటు జాతకాలు, ముహూర్తాలు కూడా చూసి బరిలోకి దింపుతున్నారని సమాచారం. జిల్లావ్యాప్తంగా ఇలాంటి భారీ పందేలతో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. ఒకే పందెంలో కోట్ల రూపాయల లావాదేవీలు జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments