కదంబ పూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గోస్కుల సదయ్య.
-పదవి లేకుండానే సేవలతో గుర్తింపు.
జనం వాయిస్, సుల్తానాబాద్:
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామంలో గత 20 సంవత్సరాల నుండి పదవులు, రాజకీయ లాభాలు వ్యక్తిగత ఆశలు ఏవి కోరుకోకుండానే గ్రామ ప్రజల సమస్యల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడిగా గోస్కుల సదయ్య ప్రత్యేక గుర్తింపు పొందారు. 20 సంవత్సరాలుగా పదవి ఆశించకుండా గ్రామం మనుగడ కోసం పోరాడుతూ.. ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించి, ఏ క్షణంలోనైనా ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయo చేసేందుకు సిద్ధంగా నిలిచి, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాగా, దీనికి గ్రామ ప్రజలందరూ స్వాగతిస్తున్నారు.గ్రామంలో వచ్చిన ఎన్నో సమస్యలకు ముందు నిలిచి పరిష్కారం చూపిన గోస్కుల సదయ్య సేవలు ఇప్పుడు ఊరంతా చర్చించుకుంటున్నారు.కదంబపూర్ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా గోసుల సదయ్య చేసిన సేవలు, కార్యక్రమాలు గ్రామ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతూ.. సేవాభావానికి నిదర్శనంగా నిలిచాయి. పదవి లేకుండానే ఎన్నో కార్యక్రమాలు,సేవలు చేసిన గోస్కుల సదయ్య సర్పంచిగా గెలిచాక గ్రామానికి మరింత అభివృద్ధి బాటలు వేస్తారని గ్రామ ప్రజలు విశ్వసిస్తున్నారు.ఈ సందర్భంగా గోస్కుల సదయ్య మాట్లాడుతూ.. పదవిలేని రోజే గ్రామానికి తాను చేసిన సేవలు తన కర్తవ్యం అని , పదవి వస్తే గ్రామ అభివృద్ధి మరింత వేగవంతంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments