EPAPER
Friday, March 6, 2026
Google search engine

ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి.

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి.
–  యువనాయకుడు అల్లిపూర్ గ్రామ సర్పంచ్ కోదాటి సాయి కిరణ్.

జనం వాయిస్, పెద్దపల్లి:

ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని యువనాయకుడు అల్లిపూర్ గ్రామ సర్పంచ్ కోదాటి సాయి కిరణ్ అన్నారు. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట హైస్కూల్లో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా  పరీక్ష ప్యాడ్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా అల్లిపూర్ గ్రామ సర్పంచ్ కోదాటి సాయికిరణ్ ముఖ్య అతిథిగా హాజరై ఇప్పుడున్న రోజులలో ప్రవేట్ స్కూల్ లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి ఉన్నత భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వ పాఠశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే సుల్తానాబాద్ మండలం లో నిరుపేదలకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు దాతల సహకారం తోటి మరియు మా సొంత డబ్బులతోటి పరీక్ష ప్యాడ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. శుక్రవారం సుల్తానాబాద్ లోని గర్ల్స్ రెసిడెన్షియల్ మరియు మండలంలోని నారాయణపూర్ హై స్కూల్, రేగడి మద్దికుంట హై స్కూల్, కనుకుల హై స్కూల్ మరియు తొగర్రాయి హై స్కూల్ లలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మ నిశాంత్, శ్రీ ఆంజనేయ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆరె సతీష్, దాడి తిరుపతి ఫౌండేషన్ సభ్యులు దేవసాని సన్నీ, గంగిశెట్టి ఆంజనేయులు, రమేష్, ప్రధానోపాధ్యాయులు దూడం సురేష్, శ్రీగిరి తిరుపతి, స్వప్న, శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!