- కాళేశ్వరంలో.. ‘హనుమాన్ దీక్షలు’.
- – సుమారు ఐదు వందల మంది హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు.
- – జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన కాళేశ్వరం.
- జనం వాయిస్, మహాదేవపూర్:
- జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం గ్రామంలో హనుమాన్ మాలధారణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కాళేశ్వరంలోని విరాంజనేయస్వామి దేవాలయంలో అర్చకులు మాడుగుల బాపు శర్మ మరియూ పవన్ శర్మ ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల హనుమాన్ భక్తులు అర్ధమండల (21రోజుల..) దీక్షలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా బాపు శర్మ మాట్లాడుతూ హనుమంతుడు అంటే అచంచలమైన భక్తి, అపారమైన శక్తి, మరియు వినయానికి నిలువెత్తు రూపం. ఆయన శివుని 11వ రుద్రావతారం, ఏడుగురు చిరంజీవులలో ఒకరైన ఆంజనేయుడు, శ్రీరామ కార్యసాధకుడిగా, బుద్ధిమంతుడిగా, మరియు భక్తుల కష్టాలను తొలగించే సంకటమోచనుడిగా కీర్తించబడతాడు అని అన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments