EPAPER
Thursday, April 2, 2026
Google search engine

చిట్టి ఇంతలా మారిపోయిందా..!

📰 Generate e-Paper Clip

చిట్టి ఇంతలా మారిపోయిందా..!

– రొమాంటిక్ సీన్స్‌తో షాక్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా.

జనం వాయిస్, సినిమా:


‘జాతిరత్నాలు’ సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఫరియా అబ్దుల్లా పేరు చెబితే ఇప్పటికీ చాలామందికి ‘చిట్టి’ పాత్రే గుర్తుకొస్తుంది. ఆ సినిమా తర్వాత కెరీర్ ఆశించినంత వేగంగా సాగకపోయినా, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను నిలబెట్టుకునేందుకు ఆమె ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మధ్యలో చేసిన కొన్ని సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా, సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో అభిమానులకు దగ్గరగా ఉంటూ తన పాపులారిటీని కొనసాగిస్తోంది.
తాజాగా తిరువీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘భగవంతుడు’ సినిమా టీజర్ విడుదల కావడంతో ఫరియా మరోసారి చర్చనీయాంశమైంది. ఈ టీజర్‌లో ఆమె లుక్, పాత్ర రూపకల్పన ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకవైపు పల్లెటూరి అమ్మాయిలా లంగా ఓణీలో కనిపిస్తూనే, మరోవైపు కథ డిమాండ్ మేరకు బోల్డ్ షేడ్స్ ఉన్న సీన్స్‌లో కనిపించడం ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలు, లిప్‌లాక్ షాట్, చివర్లో రౌడీలకు ఎదురెళ్లే ధీటైన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఇప్పటివరకు చూసిన ఇమేజ్‌కు పూర్తిగా భిన్నంగా ఆమెను చూపించినట్టు తెలుస్తోంది.
కంటెంట్ బలంగా ఉంటే గ్లామర్ రోల్స్ చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫరియా ఇప్పటికే పలుమార్లు చెప్పింది. అదే మాటకు తగ్గట్టుగానే ఈ పీరియడ్ రూరల్ డ్రామాలో ఆమె పాత్రను డిజైన్ చేసినట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. గ్లామర్‌తో పాటు ఎమోషన్, ఆగ్రహం, అమాయకత్వం కలగలిపిన పాత్రగా ఇది కనిపిస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
‘జాతిరత్నాలు’ తర్వాత సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫరియాకు ‘భగవంతుడు’ కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటనకు మంచి స్కోప్ ఉన్న ఈ పాత్రతో ఆమె మళ్లీ ఫామ్‌లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి. టీజర్‌తో సినిమాపై ఆసక్తి పెరిగిన నేపథ్యంలో, సోషల్ మీడియాలో మ్యాజిక్ చేసిన చిట్టి ఈసారి వెండితెరపై కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!