నేటి నుంచి మేడారం మహాజాతరకు హెలికాప్టర్ సేవలు.
జనం వాయిస్, మేడారం:
తెలంగాణ ములుగు జిల్లాలోని మేడారం జాతరకు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మేడారం సమీపంలోని పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. జాతర విహంగ వీక్షణకు 6-7 నిమిషాల జాయ్ రైడ్ కు ఒక్కొక్కరి నుంచి రూ.4,800 ఛార్జ్ వసూలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హన్మకొండ నుంచి మేడారానికి రానుపోను రూ.35,999 ఛార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.20 గం. మధ్య ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments