మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా ఎన్ కౌంటర్.
జనం వాయిస్, డెస్క్, నవంబర్ 18:
నక్సల్స్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మాడావి హిడ్మా,(43) హతమయ్యాడు.అతని భార్య కూడా మృతి చెందినట్లు సమాచారం.. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం.ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు.ఈ మేరకు ఏపీ డీజీపీ హరీష్ గుప్తా ప్రకటించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు.. కూంబింగ్ నిర్వహించారు. అనంతరం మావోయిస్టులు కాల్పులు జరపగా.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో హిడ్మా, హేమతో పాటు వీరికి సెక్యూరిటీగా ఉన్న నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments