కానిస్టేబుల్ కనకం 2కి భారీ అంచనాలు..
– రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల పాత్రలు హైలైట్.
జనం వాయిస్, సినిమా:
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం మొదటి భాగం మంచి స్పందన పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా కానిస్టేబుల్ కనకం రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీజన్‌ను ఈటీవీ విన్ వేదికపై 08-01-2026 నుంచి ప్రసారం చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల పోషిస్తున్న పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మొదటి భాగంలో తన పాత్రలో పూర్తిగా లీనమై కనిపించిన ఆయన, రెండో భాగంలో మరింత భావోద్వేగ లోతుతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా నటించారని సమాచారం. కథా ప్రవాహంలో ఆయన పాత్ర కీలక మలుపులు తిప్పుతూ సాగే విధానం సీజన్ రెండుకు ప్రధాన బలంగా నిలవనుందన్న చర్చ సాగుతోంది. ఇక ఈ సీజన్లో శ్రీనివాస్ అవసరాల పాత్ర కూడా అత్యంత ప్రాధాన్యతతో రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. బలమైన నిర్మాణంతో పాటు ఉత్కంఠభరిత అంశాలు ఆయన పాత్ర చుట్టూ తిరగనున్నాయని సమాచారం. రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల నటన ఈ సీజన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
1990ల కాలంలో శ్రీకాకుళం జిల్లా రేపల్లె ప్రాంతంలో జరిగే కథ నేపథ్యంగా రెండో సీజన్ సాగనుంది. అడవి గుట్ట ప్రాంతంలో మహిళలు అదృశ్యం కావడం, కనకం స్నేహితురాలు చంద్రిక మాయమవడం వంటి సంఘటనలు కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ఈ రహస్యాన్ని కనకం ఎలా ఛేదించింది అనే అంశమే సీజన్ రెండులో ప్రధానంగా ఉండనుంది. ఈ ప్రాజెక్టులో రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, మేఘ లేఖ, రమణ భార్గవ్, ప్రేమ్ సాగర్, జ్వాల కోటి, రాకేందు మౌళి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బలమైన కథనం, శక్తివంతమైన నటనలతో కానిస్టేబుల్ కనకం 2 ప్రేక్షకులను చివరి వరకు ఆకట్టుకుంటుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments