శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో హైడ్రోఫోనిక్ గంజాయి పట్టివేత!
జనం వాయిస్, వెబ్ డెస్క్:
అక్రమంగా తరలిస్తున్న గంజాయిని శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మరోసారి గంజాయి కలకలం రేపింది. ఫుకెట్ దేశము నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఎయిర్ ఇండియా విమానం సీట్ నెంబర్ 16,17 లలో హైడ్రోపోనిక్ గంజాయిని వదిలి వెళ్లారు.విదేశాల్లో సాగు చేస్తున్న హైడ్రోఫోనిక్ గంజాయి దాదాపు కిలో వరకు దొరికింది.పట్టుబడిన గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.తనిఖీలకు బయపడిన నిందితులు విమానంలోనే ఈ గంజాయిని వదిలివెళ్లి నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఇటీవల విదేశాల్లో సాగు చేస్తున్న హైడ్రోఫోనిక్ మట్టి లేకుండా సాగు చేసే గంజాయిని ఇండియాకు తరలించడం ఇటీవల పెరిగింది. ఈ తరహాలో విదేశాల నుంచి గంజాయిని తీసుకొస్తున్న వారిపై డీఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెంచారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments