జర్నలిస్టుల అక్రమ అరెస్టులు సరికాదు – కిషన్‌రెడ్డి.
జనం వాయిస్, హైదరాబాద్:
జర్నలిస్టులపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్రంగా ఖండనీయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిజం నాలుగో స్తంభమని గుర్తుచేశారు. సిట్ విచారణ కొనసాగుతున్న సమయంలోనే నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టుల ఇళ్లపై దాడులు చేసి, తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విచారణ పూర్తయ్యాక అన్ని అంశాలను పరిశీలించి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందస్తుగా జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సిట్‌పై సీఎం రేవంత్‌కు నిజంగా నమ్మకం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందని ఆయన ప్రశ్నించారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగేలా ప్రభుత్వ చర్యలు ఉండకూడదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments