EPAPER
Saturday, March 21, 2026
Google search engine

బిఆర్ఎస్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ గా జీవన్ రెడ్డి..?

📰 Generate e-Paper Clip

బిఆర్ఎస్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ గా జీవన్ రెడ్డి..?

– బీఆర్ఎస్ లో చేరనున్న జీవన్ రెడ్డి అంటూ తెలిపిన అనుచరులు.

– నేడు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ బుజ్జగింపులకు వెళ్లిన జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.

జనం వాయిస్, స్టేట్ డెస్క్:

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడటం ఖాయమైంది. ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. మద్దతు దారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ను వీడుతున్న విషయాన్ని ఖరారు చేసారు. అటు కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగింపులు కొనసాగిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ నేత లు జీవన్ రెడ్డితో టచ్ లోకి వచ్చారు. అయితే, జీవన్ రెడ్డికి వస్తున్న ఆఫర్ల వేళ ఏ పార్టీలో చేరేదీ జీవన్ రెడ్డి డిసైడ్ అయ్యారు.

జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీకి జీవన్‌రెడ్డి సేవలందించారు. అయితే, రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌తో ఆయనకు ఏమాత్రం పొసగడం లేదు. సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి జీవన్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పైగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంజయ్ కుమార్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోలేక, కాంగ్రెస్‌లో ప్రాధాన్యం లేనందునే పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే తన మద్దతు దారులతో జీవన్ రెడ్డి పార్టీ వీడుతున్న అంశం స్పష్టం చేసారు. బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమైన వేళ బీజేపీ నేతల నుంచి భారీ ఆఫర్ రావటం తో సందిగ్ధంలో పడ్డారు. మాజీ మంత్రి నేరుగా జీవన్ రెడ్డిని బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. మద్దతు దారులతో చర్చల తరువాత జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లాలనేది డిసైడ్ అయ్యారు.

మూడు నియోజకవర్గాలకు చెందిన తన మద్దతు దారులతో సమావేశం అయ్యారు. పార్టీ మార్పు పైన క్లారిటీ ఇచ్చారు. తాను ఎందుకు పార్టీ వీడుతుందీ వివరించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగింపులు కొనసాగిస్తోంది. పార్టీ వీడవద్దని ముఖ్య నేతలు కోరుతున్నారు. తాజాగా సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో జీవన్ రెడ్డి మరింత ఆగ్రహంతో ఉన్నారు. తాను కాంగ్రెస్ లో కొనసాగలేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ తో సైతం జీవన్ రెడ్డి ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. జీవన్ రెడ్డి అనుభవానికి అనుగుణంగా తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పై నిరసనలో భాగంగా రైతులతో కలిసి జీవన్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 25న జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!