EPAPER
Monday, February 16, 2026
Google search engine

శివనామస్మరణతో మారుమోగుతున్న దేవాలయాలు.

📰 Generate e-Paper Clip

శివనామస్మరణతో మారుమోగుతున్న దేవాలయాలు.

జనం వాయిస్, పెద్దపల్లి :

తెలుగు రాష్ట్రాల్లోకార్తీక పౌర్ణమిని బుధవారం తెల్లవారుజాము నుండి ఘనంగా జరుపుకుంటు న్నారు.శివాలయాలలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు,దీపారాధనలు జరుగుతున్నాయి.ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి, అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు.శ్రీశైలంలో కార్తీకపౌర్ణమి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటె త్తారు.తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామిఅమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శాన్నికి 2 గంటల సమయం పడుతుంది.కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి, పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. వరంగల్ వేయిస్తంబాల దేవాలయం, భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం,రాజన్న జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి,రామప్ప దేవాలయం, కురవి వీరభద్రస్వామి,పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

పెద్దపల్లి జిల్లాలో కిక్కిరిసిపోయిన ఆలయాలు.

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.పూజలతో దేవాలయాలు మారుమొగుతున్నాయి.పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు రామగుండం,గోదావరిఖని,మంథని దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు.పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు.

జనం వాయిస్ పాఠకులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!