EPAPER
Thursday, April 2, 2026
Google search engine

‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్..

📰 Generate e-Paper Clip

‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్..

జనం వాయిస్, సినిమా:


మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి భారీ అప్‌డేట్ వచ్చింది. సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ కుటుంబ వినోద చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నేడు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో తిరుపతిలోని ఎస్‌వీ సినీప్లెక్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ వేడుకలో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొననుండగా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. శంకర వరప్రసాద్ పాత్రలో చిరంజీవి కనిపించనుండగా, నయనతార ఆయన సరసన నటిస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో మెరవడం ఈ సినిమాకు మరింత ఆకర్షణగా మారింది.
దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో హాస్యం, భావోద్వేగాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకుంది. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!