EPAPER
Monday, February 16, 2026
Google search engine

‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ డేట్ ఫిక్స్..

📰 Generate e-Paper Clip

‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ డేట్ ఫిక్స్..

జనం వాయిస్, హైదరాబాద్ – జనవరి 02:


మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేయగా, సోషల్ మీడియాలో అది వేగంగా వైరల్ అవుతోంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, భావోద్వేగాలు, హాస్యం, సందేశాన్ని మేళవిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ట్రైలర్ విడుదలతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. చిరంజీవిని పూర్తి స్థాయి వినోదాత్మక పాత్రలో చూడబోతున్నామని, ఈ సినిమా మరోసారి సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!