మావోయిస్టులు జనజీవన స్రవంతి లో కలవాలి.
– రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఘా.
– సీపీ ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగుబాటు.
జనం వాయిస్, రామగుండం:
మావోయిస్టులు ఆయుధాలను, అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి ఎదుట 8మంది మావోయిస్టులు లొంగిపోయారు.ఛత్తిస్ ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు మిలీషియా కొరియర్ సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ లో పనిచేసే వారుగా సిపి చెప్పారు. మావోయిస్టు ముఖ్య నేత శ్రీకాంత్ తోపాటు మరో ఏడుగురు మావోయిస్టులు లొంగిపోగా, అందులో ఒకరు మహిళ మావోయిస్టు ఉన్నట్లు ఆయన తెలిపారు. మావోయిస్టులు గన్ను దించి, రాజ్యాంగాన్ని ఎత్తుకోవాలని సిపి సూచించారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులకు రక్షణ కల్పిస్తామన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున అందించే పునరావాసం తోపాటు పథకాలను వర్తింపచేస్తామన్నారు. రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని… హింసను సృష్టిస్తే నేరస్తులవుతారన్నారు. పోరు వద్దు ఊరు ముద్దు అని ఆయుధాలను, అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని సిపి పిలుపునిచ్చారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments