EPAPER
Tuesday, March 3, 2026
Google search engine

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ.‼️

📰 Generate e-Paper Clip

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ.‼️

– బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్‌కు అదనపు బాధ్యతలు.
– కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా చిత్ర మిశ్రా.


జనం వాయిస్, హైద్రాబాద్ న్యూస్ డెస్క్:

తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. మొత్తం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో పలు కీలక శాఖల్లో మార్పులు జరిగాయి. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ కుమార్‌ను నియమించారు. విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా దాన కిషోర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్‌ను నియమించారు.
ఎండోమెంట్స్ కమిషనర్‌గా హనుమంతరావుకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్‌ను నియమించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా చిత్ర మిశ్రాను నియమించారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జాకు బాధ్యతలు అప్పగించారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!