ప్రతి హామీ నెరవేర్చుతాం ఆందోళన వద్దు.
-ఓర్వలేకే మాపై ప్రతిపక్షాల విమర్శలు.
-జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు.
జనం వాయిస్,మంథని:
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేర్చుతామని,ప్రతి పక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురి కావొద్దని ప్రజలకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ బుధవారం ఎల్లారెడ్డి గూడ, కమలాపురి కాలనీ, ఇమాంగూడ, జయప్రకాష్ నగర్, తవాక్కల్ నగర్, అలీ నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు.రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని,ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఇంటింటికి తిరిగి వివరించారు.తొమ్మిదేళ్ల పాలనలో నిరుద్యోగులను గాలికొదిలేసిన బీఆర్ఎస్ నేతలు ఈ ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు.మా అభివృద్ధి,సంక్షేమ పథకాలు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంటే,అది చూసి ఓర్వలేకే బీఆర్ఎస్,బీజేపీ నాయకులు మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.సంక్షేమం, అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి..చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments