ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప మార్పులు.
జనం వాయిస్, అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారులు వెల్లడించారు. రంజాన్ పండుగ సందర్భంగా మార్చి 20న జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్షను మార్చి 21కి వాయిదా వేస్తున్నట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. మిగిలిన అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు.
పరీక్షల షెడ్యూల్ ప్రకారం మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్, 23న మ్యాథ్స్, 25న ఫిజికల్ సైన్స్, 27న బయాలజీ, 30న సోషల్ స్టడీస్, ఏప్రిల్ 1న వొకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments