EPAPER
Thursday, April 2, 2026
Google search engine

హైదరాబాద్‌లో స్వల్ప భూ ప్రకంపనలు.

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లో స్వల్ప భూ ప్రకంపనలు.

– గాజులరామారం–మెట్‌ఖాన్‌గూడాలో కంపించిన భూమి.
– భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు.

జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 10:


హైదరాబాద్‌లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఉదయం సుమారు 10:10 గంటల సమయంలో గాజులరామారం పరిధిలోని మెట్‌ఖాన్‌గూడా ప్రాంతంలో భూమి కంపించినట్లు శబ్దం వినిపించిందని చెప్పారు. ఈ ఘటనతో పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్న ప్రజలు భయంతో ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొనగా, పిల్లలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భూమి కంపించిన శబ్దం భూకంపం కారణంగానా లేక ఇతర పేలుడు పదార్థాల వల్లనో అన్న విషయంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. భూ ప్రకంపనలపై స్పష్టత రావాల్సి ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!