మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా.
జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 25:
గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీకి చెందిన గూడెల్లి సమ్మయ్య ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పరామర్శించారు. అలాగే మాజీ మేయర్ జాలి రాజమణి సోదరుడు జాలి ప్రతాప్ మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి మరణాలు తీరని లోటని పేర్కొన్నారు. అధైర్యపడకుండా మనోధైర్యంతో ఉండాలని సూచించారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భరోసా ఇచ్చారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments