గోదావరిఖనిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మైసమ్మ ఆలయాల ధ్వంసం.
-తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పెదపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.
జనం వాయిస్,గోదావరిఖని:
గోదావరిఖని పట్టణంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా,సుమారు 48 మైసమ్మ ఆలయాలను అధికారులు కూల్చివేయడం పట్ల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది భక్తుల విశ్వాసాన్ని అవమానపరచే చర్యగా మాత్రమే కాకుండా,స్థానిక ప్రజల సాంస్కృతిక,ఆధ్యాత్మిక విలువలను తాకే దురదృష్టకర సంఘటనగా పరిగణించాలన్నారు.ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోకుండా,సాంప్రదాయంగా పూజించబడుతున్న దేవాలయాలను ధ్వంసం చేయడం పూర్తిగా అన్యాయమన్నారు.ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యంగా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ను కోరారు.భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత,ఈ ఘటన పట్ల నిర్లక్ష్యం చూపిస్తే,భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండవు.ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తానని తెలిపారు.గోదావరిఖని ప్రజలు చూపుతున్న ఆవేదనను అర్థం చేసుకుని,ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments