బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి.
– బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ డిమాండ్.
జనం వాయిస్, కరీంనగర్:
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచిన తరువాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ డిమాండ్ చేశారు.సోమవారం కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ జ్యోతిభా పూలే విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కామారెడ్డి లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ప్రకటించింది తీరా అధికారంలోకి వచ్చాక సర్పంచ్ ఎన్నికలను పాత పద్ధతిలోనే నిర్వహించి బీసీ లకు తీరని ద్రోహం చేసిందని అన్నారు. చట్టబద్ధంగా రాజ్యాంగ బద్దంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేసేందుకు ఈ నెల 28 నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం అడుగడుగున అడ్డుకుంటుందని 50 శాతం పరిమితితో బీసీలను రాజకీయంగా ఎదగకుండా అణిచివేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేష్ , యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాదాసు సంజీవ్,విద్యార్తి సంఘం ఉపాధ్యక్షులు బోయిని ప్రశాంత్, బియ్యాని తిరుపతి, కరెంగాలా రవి, సంక్షేమ సంఘం కొత్తపల్లి మండల అధ్యక్షుడు పీసారా రాజు, ప్రధాన కార్యదర్శి కుంట చంద్రయ్య, బీసీ నాయకులు పల్లె రాజశేఖర్, కూన ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments