పోస్టల్ శాఖలో ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..!
జనం వాయిస్, వెబ్ డెస్క్:
భారతీయ తపాల శాఖ దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్, పోస్టుల భర్తీకి తపాలా శాఖలో 28,740 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన గ్రామీణ డాక్ సేవక్, అధికారిక నోటిఫికే షన్ 2026 జనవరి 31,న విడుదల చేయనుంది.
ఈ నోటిఫికేషన్ కింద భారత తపాలా శాఖలోని నాన్-బ్రాంచ్ పోస్టాఫీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో గ్రామ స్థాయి ఉద్యోగులు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్‌మ్యాన్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో మొత్తం 28,740 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.
ఈ ఉద్యోగాలకు తపాలా శాఖ అధికారిక ప్రకటన జనవరి 31న విడుదల చేయనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వయస్సు ఉండాలి. షెడ్యూల్డ్ కులం (SC) కు 5 సంవత్సరాలు, షెడ్యూల్డ్ తెగ (ST) కు 5 సంవత్సరాలు, ఇతర వెనుకబడిన తరగతులకు 3 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంది.
అలాగే కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే తుది ఎంపిక ఉంటుంది. అంటే ఎలాంటి రాత పరీక్ష ఉండబోదన్న మాట.10వ తరగతిలో పొందిన మార్కుల మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు స్థానిక భాషను రాయడం, మాట్లా డటం తెలిసి ఉండాలి. ద్విచక్ర వాహనం అంటే బైక్ నడపడం లేదా సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments